హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో యువకుడి కరచాలనం: మహిళ కంట తడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు హల్‌చల్ చేశారు. ఓ యువకుడు వైయస్ జగన్‌కు అత్యంత సమీపంగా వచ్చి కరచాలనానికి ప్రయత్నించాడు. కోర్టు విచారణకు హాజరై తిరిగి చంచల్‌గుడా జైలులోకి వెళ్లే సమయంలో ఓ యువకుడు మంగళవారం జగన్‌కు అతి సమీపంగా వచ్చాడు. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని జగన్‌ను సమీపించాడు.

యువకుడి చొరబాటును పోలీసులు తొలుత గుర్తించలేదు. ఆ తర్వాత అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ జైలులోకి వెళ్లిన తర్వాత యువకుడిని వదిలేశారు. మరోవైపు, జైలు వద్ద వైయస్ జగన్‌ను చూసేందుకు అభిమానులు ప్రయత్నాలు చేశారు. ఓ మహిళ ఏకంగా కంటతడి పెట్టారు. త్వరలోనే జగన్‌ బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

వైయస్ జగన్‌ను అన్యాయంగా జైలు పాలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం జగన్‌ను చూసేందుకు తనకు అవకాశం కల్పించారని ఆమె అన్నది. ఏం తప్పు చేశాడని జగన్‌ను జైలులో పెట్టారని ఆమె ప్రశ్నించింది. మంగళవారం ఉదయం పూట కూడా జగన్‌ను చూసేందుకు పలువురు జైలు వద్దకు వచ్చారు. సిబిఐ కోర్టుకు కూడా చాలా మంది వచ్చారు. దాదాపు వంద మంది కోర్టు ఆవరణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

చంచల్‌గుడా జైలు వద్ద కోర్టుకు వెళ్లే ముందు జగన్ తనను చూడడానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వాన్‌పిక్ వ్యవహారం కేసులో వైయస్ జగన్‌ను అధికారులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా పడింది.

English summary
An youth tried to give shake hand to YSR Congress president YS Jagan at Chanchalguda jail of Hyderabad. He breached the security wing and reached to YS Jagan. A woman wept seeing YS jagan near Chanchalguda Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X