వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలిక అక్రమ నిర్బంధం: రాహుల్‌పై నిరాధారమైన కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఓ బాలికను అక్రమంగా నిర్బంధించారంటూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పైన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టు సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది. బాలిక పేరుతో సహా ఆరోపణలో పేర్కొన్న పేర్లు, చిరునామా అన్నీ బోగస్ అని అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ జస్టిస్ బిఎస్ చౌహాన్, జస్టిస్ స్వతంత్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనానికి వివరించారు.

విచారణకు సంబంధించిన నివేదికను సీల్ట్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. అక్రమంగా నిర్బంధానికి గురైనట్లు పేర్కొంటున్న వ్యక్తులు, బాలిక పేర్లు, చిరునామాలు తప్పని తేలిందని తెలిపారు. పిటిషన్‌లో పేర్కొన్న చిరునామాలను, వ్యక్తుల పేర్లను నగర పంచాయతీ, జిల్లా ఆహార పౌర సరఫరాల ఇన్స్‌పెక్టర్‌లతో సహా వివిధ ప్రభత్వ అధికారులు తనిఖీ చేయగా అవి అవాస్తవమని తేలిందని వివరించారు.

నిర్బంధించిన బాలికను, ఆమె బంధువులను కోర్టు ఎదుట హాజరుపర్చాలని కోరుతూ మధ్య ప్రదేశ్‌లో ఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిషోర్ నమ్రితే దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌కు నిధులు వేరే వారు సమకూర్చారని కూడా సిబిఐ తెలిపింది. దీనికి సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. వెబ్ సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకున్న సమాచారంపై ఆధారపడి నమ్రితె పిటిషన్ దాఖలు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు.

దీనికి సంబంధించి వారు విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని... విదేశాల్లో దర్యాఫ్తు చేపట్టేందుకు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పిపి రావు తన వాదనలను వినిపిస్తూ... యువ నాయకుడి రాజకీయ భవిష్యత్తుకు కళంకం ఆపాదించడానికి చేసిన కుటిల ప్రయత్నమని ఆయన ఆరోపించారు.

English summary
CBI told the Supreme Court that the case of alleged illegal confinement of a girl in which Rahul Gandhi's name was dragged was found to be based on "non-existent" claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X