వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైంటిస్ట్‌నంటూ..: బెంగళూరు ఇస్రోలోకి మహిళ, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Woman poses as ISRO scientist, held by cops
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఉపగ్రహ నిర్మాణ కేంద్రంలోకి నకిలీ గుర్తింపు కార్డుతో చొరబడ్డారనే ఆరోపణలపై ఒక మహిళను బెంగళూరు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న ఇస్రోను ఆ మహిళ బురిడీ కొట్టించింది. తాను సీనియర్ ఇంజనీర్‌నంటూ ఇస్రోలో మూడు రోజులపాటు తిష్ఠ వేయడమేగాక, నకిలీ గుర్తింపు కార్డును చూపి ఇస్రో అధికారుల సమావేశానికి వెళ్లడానికి కూడా ప్రయత్నించింది. చివరికి సిఏఎస్ఎఫ్ తనిఖీలో పట్టుబడింది.

బ్యూలా ఎమ్.శ్యామ్ (40)పేరు గల నకిలీ గుర్తింపు కార్డు తో ఇస్రో ఆవరణలోకి ఈనెల 19న ప్రవేశించింది. అక్కడి గెస్ట్ హౌస్‌లో ఈ నెల 21 వరకు మకాం చేసింది. బెంగళూరు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని భద్రతా వలయాన్ని దాటి అంతరిక్ష భవనంలో జరుగుతున్న అధికారుల సమావేశానికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను పట్టుకున్నారు. అమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు నకిలీదని అధికారులు గుర్తించి తక్షణం పోలీసులకు అప్పగించారు.

కోర్టులో హాజరు పరిచి అక్టోబర్ 6వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఇంతలో జ్వాలా అరెస్టు సమాచారాన్ని తెలుసుకున్న ఆమె భర్త అలెక్స్ వచ్చి ఆమెకు మతిస్థిమితం లేదని చెప్పాడు. తాను అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాననీ, జ్వాలాకు మానసిక వైద్యులచే చికిత్స ఇప్పిస్తున్నానని తెలిపాడు.

ఆమె తండ్రి మృతి చెందడంతో కేరళకు వచ్చిన బ్యూలా కొద్ది రోజులుగా మందులు సరిగా వాడడం లేదనీ, ఈ స్థితిలో ఇస్రోకు వచ్చి ఉంటుందని పోలీసులతో చెప్పాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ కార్డు ఇచ్చిన కొల్లం జిల్లా ఫొటో స్టూడియో యజమానిని అరెస్టు చేయడానికి బయల్దేరారు.

English summary
Forty year old Buela M.Sam's attempt to enter the Indian Space Research Organisation(ISRO) head quarters, posing as a scientist, may have been hehind the biggest security breach of the high security research facility in recent times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X