తెలంగాణపై కెసిఆర్‌కు జగన్ ఘాటు లేఖ, బాబుపై ఫైర్

ఆయన మౌనం వెనుక అర్థం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది వరకు ఉన్న వాక్చాతుర్యం ఏమయిందని ప్రశ్నించారు. ఇరవై రోజులుగా ఢిల్లీలో ఉంటూ ఆయన ఏం చేస్తున్నారన్నారు. అక్కడ ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలపాల్సి బాధ్యత ఉందని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా వాయలార్ రవి వంటి ఢిల్లీ పెద్దలు చెప్పినప్పటికీ మళ్లీ కెసిఆర్ వారిని కలుసుకోవడమేమిటని ప్రశ్నించారు. చీము, నెత్తురు లేని వాడిలా ప్రకటనపై నిరసన ఎందుకు తెలపలేదన్నారు.
ఎవరిని మభ్యపెట్టేందుకు కెసిఆర్ ఈ వైఖరితో వెళ్తున్నారని ప్రశ్నించారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారన్నారు. నిలువెల్లా విషం ఉన్న వాడు బాబు అన్నారు. రెండు పేజీల లేఖలో ఆయన కాంగ్రెసు పార్టీ పైనా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యమ విధానాలు కూడా ప్రకటించారు.
ఈ నెల 30న తలపెట్టిన మార్చ్‌కి తెలంగాణవాదులు సహకరించారని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ ఈ లేఖలో పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా మార్చ్ జరిపి తీరుతామన్నారు.












Click it and Unblock the Notifications