హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమజ్జనానికి కదిలిన గణనాథులు, శోభాయాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganesh Immersion
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రబాదు గణనాథులు నిమజ్జనానికి బయలుదేరాయి. 11 రోజుల పాటు విశేష పూజలందుకున్న వినాయకుడి శోభాయాత్ర శనివారం ఉదయం హైదరాబాదులోని పాతబస్తీ నుంచి ప్రారంభమైంది. మొజాంజాహీ మార్కెట్ మీదుగు అది హుస్సేన్‌సాగర్ చేరుకుంటుంది. మేళతాళాలు, భక్తబృందాల కేరింతలు, నృత్యాల మధ్య ఊరేగింపులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా నిమజ్జనం జరిపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హుస్సేన్‌సాగర్ వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాదులోని ఖైరతాబాద్ మహాగణపతిని ఇంచార్జీ డిజిపి దినేష్ రెడ్డి సందర్శించుకున్నారు. గణేష్ ఉత్సవ సమితి నేతలకు ఆయన స్వాగతం పలికారు. ఖైరతాబాద్ గణేషుడి ఊరేగింపు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

గణేష్ నిమజ్జనం సందర్బంగా నగరంలో భారీ బందోబస్తు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 15 వేల మందిని భద్రత కోసం నియోగించారు. ట్యాంక్‌బండ్‌పై మూడు వేల మంది పోలీసులు మోహరించారు. నిమజ్జనం దృష్ట్యా హుస్సైన్‌సాగర్, మొజంజాహీ మార్కెట్, చార్మినార్, బషీర్‌బాగ్ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. దాదాపు 50 వేల విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు.

నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ కేంద్ర బిందువు అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని 22 చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. కాప్రా చెరువు, సరూర్‌నగర్ ట్యాంక్, రాజన్నబౌలి, మీరాలం ట్యాంక్, పల్లెచెరువు, ఎర్రగుంట, దుర్గం చెరువు, పాపిరెడ్డి చెరువు, నల్లచెరువు, గంగారం చెరువు, హఫీజ్‌పేట చెరువు, పటాన్‌చెరువు, ఐడియల్ ట్యాంక్, సున్నం చెరువు, హన్మత్‌పేట చెరువు, ప్రగతినగర్ చెరువు, సూరారం చెరువు, వెన్నెలగడ్డ చెరువు, చిన్నరాయుని చెరువు, పెద్ద రాయుని చెరువు, ఆస్మాన్ ట్యాంక్, సఫీగుడా చెరువుల్లో గణేశుడి నిమజ్జనం జరుగుతోంది.

English summary
Immersion of Ganesha statues has begun in Hyderabad. Statues are moving towards Hussain Sagar. Khairatabad statue will be moved at 6pm on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X