కారులోకి పిలిచి అంత నీచంగా.. స్టార్ డైరెక్టర్ బండారం బయటపెట్టిన బ్యూటీ!

చిత్ర పరిశ్రమ అనగానే అందరికీ గుర్తొచ్చేది రంగుల ప్రపంచం, స్టార్ల కోలాహలం. కానీ ఈ వెలుగుల వెనుక ఎంతో మంది యువతుల కన్నీళ్లు, చేదు అనుభవాలు దాగి ఉన్నాయనేది కాదనలేని నిజం. తాజాగా మరోసారి సినీ పరిశ్రమకు చెందిన ఓ చీకటి నిజం బయటపడింది. ప్రముఖ హిందీ టెలివిజన్ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' ద్వారా పాపులర్ అయిన నటి నేహల్ వడోలియా కాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తనకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ భయానక అనుభవాన్ని ఆమె పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంటర్వ్యూలో నటి నేహాల్ వడోలియా సెన్సేషనల్ కామెంట్స్
నటి నేహల్ వడోలియా ఇటీవల 'సునో ఇండియా' పాడ్‌కాస్ట్‌లో పాల్గొని.. బాలీవుడ్‌లో కొత్తగా వచ్చే నటీమణులకు ఎదురయ్యే ఇబ్బందులపై ఓపెన్‌గా మాట్లాడింది. "మనం పరిశ్రమలోకి కొత్తగా వచ్చినప్పుడు మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేయడానికి చాలా మంది ఎదురుచూస్తుంటారు. కొందరు పని ఇస్తామనే నెపంతో పిలిచి, మనల్ని ఆలోచనలో పడేసేలా మరీ దారుణంగా ప్రవర్తిస్తారు" అని నేహల్ పేర్కొంది.

Bollywood Actress Nehal Vadoliya Opens Up On Shocking Casting Couch Experience With Top Director

కారులో పిలిచి అసభ్యకర వీడియోలు చూపించిన స్టార్ డైరెక్టర్
తనకు జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకుంటూ.. 2018లో బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ (ఆయన పేరు చెప్పడానికి ఆమె నిరాకరించింది, కానీ ఆయన ఇండస్ట్రీలో చాలా ఫేమస్) తనను పని విషయమై మాట్లాడాలని పిలిచాడని చెప్పింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో వారు ఓ కారులో కలుసుకున్నారు. అయితే కారు ఎక్కగానే ఆ డైరెక్టర్ ఆమెకు ఒక అమ్మాయికి సంబంధించిన అసభ్యకరమైన వీడియోను చూపించాడు. ఆ వీడియో చూపిస్తూ.. "చూడు.. ఈ రోజు ఈ అమ్మాయికి దుబాయ్‌లో బోలెడు మంది క్లయింట్లు ఉన్నారు. నీ ఫిగర్ చాలా బాగుంది, నువ్వు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. నా దగ్గర నీ కోసం చాలా మంది క్లయింట్లు రెడీగా ఉన్నారు" అంటూ కాంప్రమైజ్ అవ్వాలనే అర్థం వచ్చేలా అసభ్యకరమైన ఆఫర్ ఇచ్చాడు.

జీవితాంతం వెంటాడే ఓ భయానక జ్ఞాపకం
ఆ స్టార్ డైరెక్టర్ ప్రవర్తనతో షాకైన నేహాల్ వడోలియా.. "సార్, మీరు నాకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు?" అని గట్టిగా ప్రశ్నించి వెంటనే కారు దిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆయన ఇండస్ట్రీలో అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగారా అని తనకు ఇప్పటికీ నమ్మబుద్ధం కావడం లేదని నేహాల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ఇలాంటి దారుణమైన వ్యక్తులు మనల్ని ట్రాప్‌లో పడేయడానికి రకరకాల వేషాలు వేస్తారని, ఇలాంటి సంఘటనలు ఏ అమ్మాయికైనా జీవితాంతం ఒక పెద్ద మానసిక క్షోభగా మిగిలిపోతాయని నేహల్ వడోలియా కన్నీటి పర్యంతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+