లక్షల్లో పలికిన గణేషుడి లడ్డూ: శంకరరావు హల్‌చల్

Ganesh laddus sell like hot cakes
హైదరాబాద్: లంబోదరుడి లడ్డూ పలుచోట్ల లక్షల్లో పలికింది. అమీర్‌పేటలో గణేష్ లడ్డూ రూ.12.15 లక్షలు పలికింది. అమీర్‌పేటలో వివిఆర్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను విశ్వాస్ రియల్ ఎస్టేట్ సంస్థ దక్కించుకుంది. గత ఏడాది ఎక్కడ లడ్డూ రూ.9.35 లక్షలు పలికింది. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ గణేశుడి లడ్డు ఈ ఏడాది రికార్డు ధర పలికింది. నిరుటి కన్నా రెండు లక్షల రూపాయలకు పైగా అధిక ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డు వేలంలో 7.50 లక్షల రూపాయలు పలికింది.

పన్నాల గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఆ లడ్డును దక్కించుకున్నాడు. హైదరాబాద్ సమీపంలోని బాలాపూర్ గణేశుడి లడ్డు నిరుడు 5.45 లక్షల రూపాయలు పలికింది. ఈసారి లడ్డుకు పోటీ మరింత తీవ్రమైంది. వేలం పాటలో 19మంది పోటీ పడ్డారు. శనివారం ఉదయం లడ్డు వేలం పాట ప్రారంభమైంది. వేలంపాటలో లక్షలు, వేలు పెరుగుతూ చివరికి లడ్డు ధర రూ.7.50 లక్షల రూపాయలు పలికింది.

బాలాపూర్ లడ్డు వేలం పాట అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ విగ్రహం ఎత్తుకు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటే బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం పాటలో పలికే ధరతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. బాలాపూర్ గణేశుడి లడ్డు అత్యంత శుభప్రదమైందనే ప్రచారం సాగడంతో దాన్ని వేలంపాటలో పాడుకోవడానికి ఏ యేటికాయేడు పోటీ పెరుగుతూ వస్తోంది.
తన నాన్న చివరి కోరిక మేరకే లడ్డును వేలం పాటలో దక్కించుకున్నట్లు పన్నాల గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

సరూర్ నగర్ మండలంలోని బడంగ్‌పేటలో వినాయకుడి లడ్డూను గాదం నర్సింహ అనే వ్యక్తి రూ.6.55 లక్షలకు దక్కించుకున్నారు. ఇదే చోట గత ఏడాది లడ్డూ రూ.6.25 లక్షలు పలికింది. సుచిత్ర చౌరస్తాలో రూ.4.55 లక్షలు, సర్దార్ పటేల్ నగర్‍‌లో రూ.4.51 లక్షలు, కొత్తగూడలో రూ.3.51 లక్షలు, మాదాపూర్‌లో రూ. 3.51 లక్షలు, కూకట్‌పల్లిలో రూ.3 లక్షలు, ఫిల్మ్ నగర్‌లో రూ.2 లక్షలు ఇలా దాదాపు చాలా చోట్ల గణేషుడి లడ్డూ రూ.లక్షల్లో పలికింది.

శంకరన్న హల్ చల్

కాగా నిమజ్జనం సందర్బంగా మాజీ మంత్రి శంకర రావు హల్ చల్ చేశారు. శనివారం రాత్రి గణేషుడి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న శంకర రావు డ్యాన్స్ చేసి అందర్నీ అలరించారు. డ్యాన్స్ చేస్తూ విజిల్ వేసి అందర్నీ ఉత్సాహపర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+