వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఆలోచన: నగదు బదలీపై చిరంజీవికి రేవంత్ ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: గత సాధారణ ఎన్నికల సమయంలో తమ పార్టీ నగదు బదలీ పథకాన్ని ప్రతిపాదించినప్పుడు ఎలా సాధ్యమని ప్రశ్నించిన తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పించిన కాంగ్రెసు నేతలు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి శనివారం ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో శనివారం రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తారని చెప్పడానికి తాజాగా దేశంలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రధాని మన్మోహన్‌ సింగ్ చేసిన ప్రకటనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టారని, దీనిని అమలు చేయడానికి ఏటా రూ.40 వేల కోట్లు కావాలని, కరెన్సీ నోట్లు అచ్చుకొట్టి పంచిపెడితే తప్ప సాధ్యం కాదని నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, ఇది బోగస్ పథకమని వయలార్ రవి ఆరోపించారని గుర్తు చేశారు.

స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు తెస్తారా లేక సొంతంగా ముద్రిస్తారా అని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఎద్దేవా చేశారని, ఇప్పుడు ప్రధాని కూడా ప్రింటింగ్ ప్రెస్ పెట్టి నోట్లు ముద్రిస్తారా చెప్పాలని వయలార్ రవి, చిరంజీవిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే ఈ పథకాన్ని విమర్శించారని, చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి కూడా మార్గదర్శకునిగా నిరూపితమయ్యారని చెప్పారు. తెలుగుదేశం తన హయాంలో ఎన్నో వినూత్న ఆలోచనలతో పరిపాలనా రంగాన్ని సంస్కరించిందన్నారు.

దానిలో భాగంగానే దళారుల ప్రమేయాన్ని తగ్గించడానికి నగదు బదిలీని ప్రతిపాదించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిండా దళారులు కిటకిటలాడుతున్నారని, ఏ పథకం పెట్టినా వారి మేతకే చాలడం లేదని, దళారుల ప్రమేయం తగ్గిస్తామంటే భయపడిపోయి నగదు బదిలీని వ్యతిరేకించారని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని తానే పెడతామనేసరికి వారికి నోరు పెగలడం లేదన్నారు.

English summary
Telugudesam Party spokes person Revanth Reddy has questioned Congress leaders Chiranjeevi and Vayalar Ravi about PM Manmohan Singh's money transfer scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X