హైదరాబాద్‌లో టెన్షన్ టెన్షన్: ఓయులో బైక్ ర్యాలీకి చెక్

Hyderabad
హైదరాబాద్: తాము గాంధీ మార్గంలో తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆదివారం ఆరోపించారు. నెక్లెస్ రోడ్డులోని తెలంగాణ మార్చ్ వేదిక వద్దకు ఓయు విద్యార్థులు బైక్ ర్యాలీ తలపెట్టారు. వీరి బైక్ ర్యాలీని పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఓ వైపు కవాతుకు అనుమతిచ్చినట్టే ఇచ్చి తమను అడ్డుకోవడం సబబు కాదన్నారు.

అడ్డుకుంటే జరగబోయే పరిణామాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తాము శాంతియుతంగా కవాతు నిర్వహిస్తామన్నారు. తాము ఎలాగైనా వేదిక వద్దకు చేరుకుంటామన్నారు. తాము పోలీసులు సూచించిన మాదిరిగా ఏడు గంటల వరకే కవాతు నిర్వహించమని, ఓపిక ఉన్నంత వరకు, తెలంగాణ వచ్చే వరకు అక్కడే కూర్చుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ఓయు ఎన్‌సిసి గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ప్రభుత్వమే తూట్లు... కోదండరామ్

కవాతుకు తరలి వచ్చే తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. కవాతుకు అనుమతి ఇచ్చి ప్రభుత్వం మళ్లీ అరెస్టులు, అడ్డుకోవడాలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందన్నారు. తెలంగాణ జిల్లాల్లో రాత్రి నుండి విద్యుత్‌ను కట్ చేశారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యయుతంగా కవాతు నిర్వహిస్తామని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. తాము ఏడు గంటల వరకు కూర్చుంటామని చెప్పలేదని, ఓపిక ఉన్నంత వరకు కవాతు నిర్వహిస్తామన్నారు. జెఏసి కార్యాచరణను సాయంత్రం ప్రకటిస్తామన్నారు. గౌరవం లేని స్థానానికి తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి వెంటనే ప్రజల్లోకి రావాలని సూచించారు. కవాతుకు ప్రజలు రాకుండా బస్సులు, రైళ్లను నిలిపివేశారన్నారు. అడ్డుకుంటే ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.

తెలంగాణవాతుల అరెస్టుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రజా గాయకుడు గద్దర్, భారతీయన జనతా పార్టీ, తెలంగాణ ప్రాంత ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ, సచివాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండువైపుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలకు మినహా ఎవరికీ అనుమతించకుండా ఆంక్షలు పెట్టారు. మరోవైపు తెలంగాణ జిల్లాల నుండి తరలి వస్తున్న తెలంగాణవాదులను పలువురిని పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణవాదులు ప్రయివేటు వాహనాల్లో తరలి వస్తున్నారు.

తెలంగాణవాదులను అరెస్టు చేయం.. దినేష్ రెడ్డి

తెలంగాణవాదులను తాము అరెస్టు చేయడం లేదని డిజిపి దినేష్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామన్నారు. ప్రజలు ఆగ్రహావేశాలకు గురి కావద్దని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు. తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేయరన్నారు. శాంతియుతంగా కవాతు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+