ఎమ్మెల్యే విష్ణువర్ధన్ అరెస్ట్: సిఎంపై పార్టీనేతల నిప్పులు

తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. తెలంగాణవాదుల అరెస్టు, పార్లమెంటు సభ్యుల అరెస్టు బాధాకరమన్నారు. తెలంగాణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. కిరణ్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిరణ్‌కు మానవత్వం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఆయన ఖూనీ చేశారన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. సహచర ఎంపీల అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పోలీసుల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని మంద జగన్నాథం అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దూరదర్శన్ వాహనానికి నిప్పు పెట్టారు.
సచివాలయం వద్ద మీడియా ప్రతినిఇధులు ఆందోళనకు దిగారు. పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ వారు నిరసన చేపట్టారు. మధ్యాహ్నం అరెస్టు చేసిన తెలంగాణ ప్రాంత ఎంపీలను పోలీసులు శంషాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో భారీగా కాంగ్రెసు కార్యకర్తలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications