జార్ఖండ్ ఎమ్మెల్యే ఇంట్లో బాలికపై గ్యాంగ్‌రేప్, అల్లుడూ..

పాట్నాలోని జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ సింగ్ ఇంట్లో ఇరవై ఏళ్ల బాలికపై ఐదుగురు దుండగులు గ్యాంగ్ రేప్ జరిపారు. నిందితుల్లో ఎమ్మెల్యే అల్లుడు కూడా ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉంటున్న బాధితురాలిని ఎత్తుకెళ్ళిన దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాగా, హర్యానాలోనూ ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. సోనాపేట్ సమీపంలోని గోహన ప్రాంతంలో పదకొండవ తరగతి చదువుతోన్న ఓ బాలికపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గురువారం అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications