అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపితోనే: యాత్రకు హరికృష్ణ మద్దతు, చిత్తుగా.. బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna-Chandrababu Naidu
అనంతపురం/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, బాబు బావమరిది నందమూరి హరికృష్ణ మద్దతు పలికారు. చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలని హరికృష్ణ అనంతపురం జిల్లాలోని సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెరుగైన పాలన కోసమే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు.

కాంగ్రెసు పాలనలో రాష్ట్రం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెసు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని తాను ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన చెప్పారు. బాబు పాదయాత్రకు స్వాగతం పలికేందుకే తాను అనంత వచ్చానని చెప్పారు.

కాంగ్రెసును చిత్తుగా ఓడించాలి.. బాబు

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసును చిత్తు చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెసు పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రం విద్యుత్ సమస్యతో తల్లడిల్లుతోందని, దీనికి కాంగ్రెసుకు ముందు చూపు లేకపోవడమే కారణమన్నారు.

తెలుగుదేశం పార్టీతోనే సమర్థవంతమైన పాలన ఉంటుందన్నారు. కాంగ్రెసు ప్రజావ్యతిరేక విధానాలపై తాము రాజీనాలేని పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెసు పాలనలో పేదవారి జీవితాలు చితికి పోయాయని ఆరోపించారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరిగాయన్నారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. కాంగ్రెసు వల్ల రాష్ట్రం పరువు పోయిందన్నారు.

English summary
Telugudesam Party Rajyasabha Member Nandamuri Harikrishna is supporting party chief Nara Chandrababu Naidu's Vastunna Meekosam padayatra. He was offered special pooja at Sugur Hanuman Temple on Monday for padayatra success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X