బయటకు పొమ్మన్లేదు, కానీ: కేజ్రీవాల్‌పై అన్నా హజారే

తాను నవంబరులో దేశవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెడితే ఆయన పార్టీకి మద్దతుగా తాను ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. అవినీతిరహిత పార్టీగా అది ఉంటుందని ఆయన అన్నారు. ఆయన పార్టీకి ప్రచారం చేసినప్పటికీ తాను ఎప్పటికీ ఎన్నికలలో పోటీ మాత్రం చేయనని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే తన ఉద్దేశ్యమన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు.
కేజ్రీవాల్, సిసోడియాను కలుస్తానని అన్నారు. అవినీతిపై పోరాడేందుకు కార్యకర్తలకు శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. త్వరలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నా హజారే ప్రకటించారు. కేజ్రీవాల్, అన్నా హజారేల మధ్య విభేదాలు పొడసూపినట్లుగా గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పార్టీ పెట్టడాన్ని హజారే తీవ్రంగా వ్యతిరేకించారని, ఆయనతో విభేదించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అన్నా ఈ రోజు వాటిని ఖండించారు.
రేపు పార్టీని ప్రకటించనున్న కేజ్రీవాల్
రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయడం ద్వారా మంగళవారం రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాన్టిట్యూషనల్ క్లబ్‌లో ఏర్పాటు చేసే సమావేశంలో పార్టీ ఏర్పాటు ప్రకటనను మనీష్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పార్టీ ప్రకటన, విధివిధానాలను రేపు ప్రకటిస్తామని చెప్పారు. తనకు అన్నా హజారేతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.












Click it and Unblock the Notifications