కెసిఆర్, కోదండరామ్ మధ్య ప్యాచప్‌కు యత్నాలు

తెలంగాణ జెఎసి నేతలు అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ చెప్పా పెట్టకుండా కెసిఆర్ మెదక్ జిల్లాలోని ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. దీంతో తెలంగాణ ఉద్యమ పార్టీ తెరాసకు నాయకత్వం వహిస్తున్న కెసిఆర్‌ను దూరం చేసుకోవడానికి ఇష్టం లేని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు మధ్యవర్తిత్వానికి దిగారు. కెసిఆర్‌కు వారు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు విఠల్, రవీందర్ రెడ్డి, దేవీ ప్రసాద్, స్వామిగౌడ్ శనివారంనాడు కెసిఆర్‌ను ఫామ్ హౌస్‌లో కలిసి మాట్లాడారు. కోదండరామ్, శ్రీనివాస గౌడ్ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. తనను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేసినా కెసిఆర్ తెలంగాణ జెఎసి నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఒకటి, రెండు రోజుల్లో అపాయింట్‌మెంట్ ఇవ్వవచ్చునని కెసిఆర్‌తో సమావేశమైన ఉద్యోగ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భేటీకి తెలంగాణ జెఎసి నాయకులు విజ్ఞప్తి చేసినా తర్వాత కలుద్దాంలే అంటూ కెసిఆర్ దాటవేస్తూ వచ్చారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా కోదండరామ్ వ్యవహరించిన తీరు పట్ల, తమపై కొన్ని ప్రజా సంఘాల నాయకులు విమర్శలు చేస్తున్నా కోదండరామ్ నివారించకపోవడం పట్ల కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, కోదండరామ్ స్థానంలో స్వామిగౌడ్‌ను తెలంగాణ జెఎసి చైర్మన్‌గా నిలబెట్టేందుకు కెసిఆర్ ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications