కోదండరామ్‌పై చల్లారని కెసిఆర్, తిరిగి ఫామ్‌హౌస్‌కు

కెసిఆర్ అపాయింట్‌మెంట్ సమాచారం టీఆర్ఎస్ శిబిరం నుంచి జేఏసీకి శుక్రవారం రాత్రి వరకు అం దలేదు. మరోవైపు ఆయన మధ్యాహ్నమే మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు. "కేసీఆర్‌ను కలవటానికి టైం అడిగాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఆయనే కలుస్తారులే అని ఊరుకున్నాం'' అని జేఏసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. దీన్నిబట్టికోదండరాం, కొంత మంది జేఏసీ నేతలపై టీఆర్ఎస్‌లో ఆగ్రహం చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
జేఏసీ చైర్మన్ పదవి నుంచి కోదండరాంను తప్పించి స్వామిగౌడ్‌ను కూర్చోబెట్టాలనే కేసీఆర్ వ్యూహం జేఏసీలోని మిగిలిన పక్షాల ప్రతి వ్యూహంతో బెడిసికొట్టిందని అంటారు. పరకాల ఉప ఎన్నికలతో వారి మధ్య వైరుధ్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. కోదండరాం, కేసీఆర్ ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అనివార్య పరిస్థితుల్లో గులాబీ నేతలు తెలంగాణ మార్చ్‌కు చివరి దశలో మద్దతు ప్రకటించారు. మార్చ్‌కు జన సమీకరణ చేసిన టీఆర్ఎస్ నేతలకు వేదికపై తగిన ప్రాధాన్యం లభించకపోవటం కోపం తెప్పించింది.
హరీశ్‌రావును ఉద్దేశించి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ పై విమలక్క చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు మార్చ్ మధ్యలోనే వెనుదిరిగారు. ఈక్రమంలో జేఏసీ భాగస్వామి అయిన న్యూడెమోక్రసీ నేతలను కేసీఆర్ గురువారం తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడినప్పుడు కూడా కోదండరాం తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications