జెఎసితో కలిసి తెలంగాణ పోరుకు కాంగ్రెసు ఎంపీలు సై

తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, పలువురు జేఏసీ నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. గద్దర్ కూడా ఈ భేటీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోకి తెలంగాణ మంత్రులను తీసుకురావాలని, ఇక నుంచి కాంగ్రెస్ మంత్రులే ధ్యేయంగా వారిపై ఒత్తిడి పెంచాలనీ జే.ఏ.సీ. నాయకులు సూచించారు. మంత్రులు రాజీనామా చేస్తే, పరిస్ధితి ఏనాడో సానూకూలంగా మారి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసులు నమోదు చేసిన కేసులను తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జెఎసి ఇచ్చిన కార్యక్రమాల్లో తాము పాల్గొంటామని కాంగ్రెసు ఎంపీలు చెప్పారు.
మార్చ్ వంటి కార్యక్రమాలు ఇంకా ఉంటాయని గద్దర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్లమెంటు సభ్యులను అరెస్టు చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో మంత్రులు పాల్గొనవద్దని ఆయన సూచించారు. మార్చ్ సందర్భంగా ధ్వంసమైన అస్తుల కన్నా తెలంగాణ బలిదానాలు గొప్పవని కె. కేశవ రావు అన్నారు.
తమపై విమర్శలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని మధు యాష్కీ అన్నారు. తెలంగాణవారిపై కేసుల ఎత్తివేతకు మంత్రులతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వాన్ని కాపాడేందుకే తాను తెలుగుదేశం నుంచి కాంగ్రెసులోకి వచ్చానని, తనపై విమర్శలు అర్థరహితమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications