అమెరికా ప్రమాదంలో తెలుగు యువకుడి మృతి

తెనాలిలోని యడ్లపాటి వెంకట్రావు బజారు విష్ణుటవర్స్‌లో నివాసం ఉంటున్న దావూలూరి షణ్ముఖరావు, సరోజినీ దంపతుల కుమారుడు గౌతమ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. తండ్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో పనిచేసి పదవీవిరమణ చేశారు. తల్లి హైదరాబాదులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లైబ్రరేయన్‌గా పనిచేస్తున్నారు.
అమెరికాలోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో గౌతమ్ ఎంఎస్ పూర్తి చేసి ఒపిటి డాక్యుమెంటేషన్ కోసం వేచి చూస్తున్నాడు. అది రాగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతానని గౌతమ్ ఇటీవల తల్లిదండ్రులకు చెప్పాడు. ప్రతి రోజూ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే గౌతమ్ నాలుగు రోజులుగా పలకరించకపోవడంతో అనుమానం వచ్చి శాన్‌ఫ్రాన్సిస్కోలోని అతని మేనమామ మొవ్వా ఆంజనేయ ప్రసాద్‌కు, కాలిఫోర్నియాలో ఉంటున్న సోదరిబావలను సంప్రదించారు.
వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతను అమెరికాలో ఈ నెల 2వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications