అక్రమ సంబంధాలు: భర్తలను చంపేసిన భార్యలు

Warangal District
వరంగల్/నెల్లూరు: భర్తలను చంపిన భార్యల ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఓ సంఘటన వరంగల్ జిల్లాలో జరగగా, మరో సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అతి కిరాతకంగా భర్త గొంతుకోసి శవాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చివేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. 8నెలల కిత్రం జరిగిన ఈ సంఘటన హన్మకొండ మండలంలో ని టేకులగూడెంలో శుక్రవారం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతోనే భర్తను హత్య చేసిందని గ్రామస్థులు చెబుతున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి - ఆరూరి వెంకటయ్య (48), యాకలక్ష్మి అనే దంపతులు టేకులగూడెంలో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. 8 నెలల క్రితం ఉన్నట్టుండి వెంకటయ్య అదృశ్యమయ్యాడు. దీం తో గ్రామస్థులు యాకలక్ష్మిని పలు మార్లు ప్రశ్నించారు. ఎప్పుడు ప్రశ్నించినా తన భర్త వేరొక మహిళతో వెళ్ళిపోయాడంటూ సమాధానమిచ్చేది. అయితే యాకలక్ష్మి ఇచ్చిన స మాధానం పట్ల గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కోణంలోనే ఆమె ప్రవర్తన తీరుపై దృష్టి సారించారు.

నెలలు గడుస్తు న్నా వెంకటయ్య ఆచూకీ లభించలేదు. దీం తో యాకలక్ష్మిపై ఉన్న అనుమానం బలపడింది. ఈ సమయంలోనే యాకలక్ష్మి ఇంటి పరిసరాల నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గ్రామస్థులు పసిగట్టారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు కొంత మంది తెలిపారు. దీంతో యాకలక్ష్మిని పిలిచి విచారించగా ఆమె మాట్లాడిన తీరు అనుమానంగా ఉండడంతో వారు మడికొండ పోలీసులకు సమాచారమందించారు.

ఈ సమాచారాన్ని అందుకున్న సీఐ రమేష్‌బాబు, ఎస్ఐ రాఘవేందర్ తమ సిబ్బందితో కలిసి టేకులగూడెంకు చే రుకుని పరిస్థితిని సమీక్షించారు. యాకలక్ష్మిని పోలీసులు విచారించారు. చివరకు ఆమె నేరం ఒప్పుకుంది. తన భర్తను చంపి శవాన్ని ఇం టి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టినట్లు తెలిపింది. యాకలక్ష్మి కొడుకు శ్యాం కూడా తన తండ్రిని తల్లే చంపిందని, ఈ వి షయాన్ని బయటికి చెబితే తనను కూడా చంపేస్తానందని, అందువల్లనే ఈ విషయా న్ని బయటికి చెప్పలేదని, తన అక్కకు కూడా చెప్పలేదని వివరించాడు. పోలీసులు సెప్టిక్ ట్యాంక్‌ను తెరిపించి వెంకటయ్య అస్థిపంజరాన్ని వెలికితీశారు.

మద్యానికి బానిసగా మారి వేధిస్తున్నందునే తన భర్తను చంపినట్లు యాకలక్ష్మి పో లీసులకు తెలిపింది.యాకలక్ష్మిని అదుపులోకి తీసుకుని పోలీ స్ స్టేషన్‌కు తరలించారు. హత్యలో ఆమెకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. టేకులగూడెం విఆర్ఓ రజిత ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు.

ఇదిలావుంటే, నెల్లూరులోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న చెరుకూరు చెన్నయ్య (40)ను అతని భార్యనే హత్య చేసింది. చెన్నయ్య భార్య విజయలక్ష్మి మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం పెట్టుకుందని, దాంతో చెన్నయ్య మద్యానికి బానిస అయ్యాడని అంటున్నారు. ఇటీవల వారిద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సమయంలో విజయలక్ష్మి చెన్నయ్యను రోకలిబండతో కొట్టింది. దాంతో అతను మరణించాడు. ఓ అద్దె కారు తెప్పించి భర్త శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేసింది. కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విజయలక్ష్మి పట్టుబడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+