సల్మాన్ స్టంట్ చేయబోయి ఉసురు తీసుకున్న బాలుడు

Ek Tha Tiger
బెంగళూరు: ఏక్ థా టైగర్ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్ చేసిన రైలు స్టంట్‌ను అనుకరించడానికి ప్రయత్నించి ఓ 16 బాలుడు ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బెంగళూర్‌లోని న్యూ బాంబూ బజార్‌కు చెందిన మొహమ్మద్ ఫైజాన్ అనే బాలుడు ఈ నెల 3వ తేదీ ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఫస్ట్ టర్మ్ పరీక్షను ఎగ్గొట్టి ఇద్దరు మిత్రులతో కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.

పదో తరగతి చదువుతున్న అతను గోల్డెన్ చార్యోట్ మీదికి ఎక్కాడు. ఆ రైలు నుంచి దుమికే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతను ప్లాట్‌ఫారంపై పడిపోయాడు. తల మొదటి ప్లాట్‌ఫారానికి తాకింది. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఏక్ థా టైగర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఏ విధంగా రైలు నుంచి దుమికాడో చేసి చూపించాలని అతను అనుకున్నాడు.

పార్కు చేసి ఉన్న రైలు పైకి ఎక్కిన మిగతా మిత్రులు అతన్ని ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. రైలు ఎక్కిన తర్వాత ఫైజాన్‌ హైటెన్షన్ వైర్లకు దగ్గరగా వచ్చాడని, దాంతో ప్రమాదం సంభవించిందని అంటున్నారు. రైల్వే పోలీసులు వచ్చే లోగానే మిగతా మిత్రులు పారిపోయారు.

రైల్వే పోలీసులు అంబులెన్స్‌ తెప్పించి ఫైజాన్‌ను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని శివాజీనగర్ న్యూ బాంబూ బజార్‌లో హోటల్ నడుపుతున్న ఫైజాన్ తండ్రి ముస్తాఖ్ అహ్మద్‌కు చేరవేశారు. విక్టోరియా ఆస్పత్రి నుంచి అతన్ని వైద్యుల సలహా మేరకు నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తలకు తగిలిన గాయాలకు చికిత్స పొందుతూ ఫైజాన్ శుక్రవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+