హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మూడు సాకు: తెలంగాణపై టిజి, కవాతుపై పరకాల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parakala Prabhakar - TG Venkatesh
కర్నూలు: తెలంగాణ కోసం ఆ ప్రాంత నేతలు మూడు సమస్యలను సాకుగా చూపి సెంటిమెంట్ ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం కర్నూలు జిల్లాలో అన్నారు. వెనుకబాటుతనం, సెంటిమెంట్, ఉద్యోగాల పేరుతో నేతలు తెలంగాణను డిమాండ్ చేస్తున్నారన్నారు. అయితే వారు చెప్పే పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయన్నారు.

కేవలం రాజ్యాధికారం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని చేస్తున్నారని ఆరోపించారు. తమ మొదటి నినాదం సమైక్యాంధ్రనే అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా కర్నూలు ఉండి ఉంటే రాయలసీమ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ఇప్పుడు హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మూడు సమస్యలు చూపించి అడుగుతున్నారని, కానీ అది ఇప్పుడు లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.

మార్చ్ తుస్సుమంది... పరకాల ప్రభాకర్

గత నెల 30వ తేదిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ కవాతు తుస్సుమందని విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్ అన్నారు. ఐకాస చెప్పినట్లుగా కవాతులో లక్షలాదిమంది పాల్గొనలేదన్నారు. కేవలం ముప్పై వేల మంది మాత్రమే పాల్గొన్నారని, సాయంత్రానికి కేవలం 1500 మంది మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులను దూషించడం సరికాదన్నారు.

రాష్ట్ర విభజన కోసం చేస్తున్న వాదనలు సత్యదూరమన్నారు. దానిని నిరూపించేందుకే విశాలాంధ్ర కృషి చేస్తోందన్నారు. విభజనవాదులు విడిపోవడానికి ఒక కారణం చెబితే కలిసి ఉండటానికి తాము వంద చెబుతామన్నారు. ఏ ప్రాంతంలో చర్చ ఏర్పాటు చేసినా సిద్ధమన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రాయలసీమ వెనుకబడి ఉందన్నారు.

English summary

 Vishalandhra leader Parakala Prabhakar said on Sunday that Telangana march has failed which is organised by Telangana JAC on September 30th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X