సుప్రీం ప్రశ్నకు జగన్ ఏంసమాధానమిస్తారు: నారాయణ

ఇవన్నీ నిరాధారమైనవని చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు యాత్రను స్వాగతిస్తున్నామని, ఒక రాజకీయ పార్టీ నాయకునిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేయడం స్వాగతించదగిన విషయమేనన్నారు. పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా బాగా వస్తున్నట్లు సమాచారం ఉందని, తనకు తెలిసినంత వరకు బాబు యాత్రకు మంచి స్పందనే వచ్చిందన్నారు.
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలపై ఎస్పీ, బిఎస్పీ వంటి పార్టీలు రోజుకో మాట మాట్లాడుతున్నాయన్నారు. వామపక్షాలు ప్రజలను పోరాటాలకు సమాయత్తం చేస్తాయని చెప్పారు. డీజిల్, గ్యాస్‌ధరల పెంపు విషయంలో ప్రధాని బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దసరాలోగా తెలంగాణపై సానుకూల ప్రకటన వస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా తమకు డెడ్‌లైన్‌ల మీద నమ్మకం లేదని, ఉద్యమాలనే నమ్ముతామని నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications