హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోమశేఖర రెడ్డికి బెయిల్: నిమ్మగడ్డ ప్రసాద్‌కు నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somasekhar Reddy-Nimmagadda Prasad
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో అరెస్టైన సోమశేఖర రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు సోమశేఖరకు ఇచ్చింది. దేశం విడిచి వెళ్లవద్దని, పాస్‌పోర్టులు ఎసిబి కోర్టుకు అప్పగించాలని, లక్ష రూపాయలతో కూడిన రెండు వ్యక్తిగత బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

గతంలోనే సిపి నెంబర్ 8లో బెయిల్ మంజూరు కాగా తాజాగా సిపి నెంబర్ 9లో హైకోర్టు సోమశేఖర రెడ్డికి బెయిల్ ఇచ్చింది. ఎసిబి దాఖలు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో చర్లపల్లి జైలు నుండి ఇవాళ విడుదలయ్యే అవకాశముంది. ఈ కేసులో ఇప్పటికే దశరథరామిరెడ్డి, పట్టాబి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్రలు బెయిల్ పైన విడుదలయ్యారు.

జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించి. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. త్వరలో మరో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు చేస్తారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు.

English summary
Somasekhar Reddy has get bail from High Court of Andhra Pradesh on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X