వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దర్యాప్తు చేసుకోవచ్చు: మాయావతిపై సిబిఐ కొరడా

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత మాయావతికి మళ్లీ సిబిఐ దర్యాప్తు తలనొప్పి పట్టుకుంది. మాయావతి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును దర్యాప్తు చేసుకునే స్వేచ్ఛ సిబిఐకి ఉందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

మాయావతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును తిరిగి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సిబిఐకి, మాయావతికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తాము ఎవరినీ రక్షించేందుకు ప్రయత్నించడం లేదని, మాయావతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేసే స్వేచ్ఛ సిబిఐకి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాయావతిపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తును కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ కోరింది.

తమ ఇదివరకటి తీర్పు మాయావతి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తునకు ఏ విధమైన ఆటంకం కాదని సుప్రీంకోర్టు పదే పదే స్పష్టం చేసింది. దర్యాప్తును పూర్తి స్థాయిలో సాగించడానికి సిబిఐకి స్వేచ్ఛ ఉందని చెప్పింది.

దర్యాప్తు చేసే అధికారం సిబిఐకి లేదని తాము ఎప్పుడూ చెప్పలేదని, దర్యాప్తు చేసుకోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని వివరించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమలేష్ వర్మ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

English summary
The Supreme Court on Tuesday issued notice to the Centre and the CBI on a petition seeking continuance of investigation into alleged disproportionate assets of farmer UP chief minister Mayawati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X