రాష్ట్ర రాజకీయాల్లో అగ్రనేతలు: సన్ షైనింగ్
హైదరాబాద్: ప్రస్తుతం నడుస్తున్నది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ. కుటుంబాలు రాజకీయాల్లో అధిపత్యం చెలాయించడం పరిపాటిగా మారింది. జిల్లాల్లో కొన్ని కుటుంబాలు రాజకీయాల్లో తిష్ట వేసుకుని మరొకరిని రాకుండా చేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయ అగ్రనేతలు కూడా తమ తమ కుమారులను తమ వారసులుగా ముందుకు తెచ్చే ప్రయత్నాలు సాగించడం, లేదంటే కుమారులే తమ తండ్రుల చెప్పుల్లో కాలు పెట్టాలను కోవడం కూడా సాగుతూనే ఉన్నది.

రాష్ట్ర అగ్రనేతలు: సన్ షైనింగ్
రాష్ట్రానికి సంబంధించి ముగ్గురు అగ్రనేతలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మొదటగా చెప్పాల్సింది వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగానే జగన్ ఒక్కసారిగా యువనేతగా మారిపోయారు. తనదంటూ ఓ ప్రత్యేకమైన బలగాన్ని ఆయన తయారు చేసుకున్నారు. నిజానికి, కాంగ్రెసులో అటువంటి ప్రయత్నాలు అంతగా రాణించవు కానీ రాష్ట్ర కాంగ్రెసును వ్యక్తి కేంద్రంగా మార్చిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుంది.

రాష్ట్ర అగ్రనేతలు: సన్ షైనింగ్
ఇక, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, ఆయన కుమారుడు నారా లోకేష్ చాలా కాలం తెర వెనకే ఉండిపోయారు. తన చదువులేవో తాను చదువుకుంటూ, తన వ్యాపారాలేవో తాను చూసుకుంటూ తెర వెనకే ఉండిపోయారు. కానీ, అకస్మాత్తుగా ఆయన అడ్డంకులను అధిగమించి రాజకీయాల్లో తన తండ్రి తర్వాత తనదే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు.

రాష్ట్ర అగ్రనేతలు: సన్ షైనింగ్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి కూడా అది తప్పలేదు. తెరాస అధినేత కెసిఆర్‌కు మేనల్లుడు హరీష్ రావు అండదండలు అందిస్తూ వచ్చాడు. కెసిఆర్ తర్వాతి స్థానం హరీష్ రావుదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ విదేశాల నుంచి కెసిఆర్ కుమారుడు కెటి రామారావు వచ్చేసి ఆ స్థానాన్ని ఆక్రమించారు. కెటిఆర్‌గా పిలిచే కెటి రామారావు తన తండ్రి స్థానంలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధపడ్డారని చెప్పవచ్చు. ఏమైనా, అగ్రనేతల సన్ షైనింగ్ బ్రహ్మాండంగా వెలిగిపోతోంది.
రాష్ట్రానికి సంబంధించి ముగ్గురు అగ్రనేతలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మొదటగా చెప్పాల్సింది వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగానే జగన్ ఒక్కసారిగా యువనేతగా మారిపోయారు. తనదంటూ ఓ ప్రత్యేకమైన బలగాన్ని ఆయన తయారు చేసుకున్నారు. నిజానికి, కాంగ్రెసులో అటువంటి ప్రయత్నాలు అంతగా రాణించవు కానీ రాష్ట్ర కాంగ్రెసును వ్యక్తి కేంద్రంగా మార్చిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే వైయస్ జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన మరణం తర్వాత తన తండ్రి స్థానాన్ని తాను అధిష్టించడానికి ప్రయత్నించారు. కాంగ్రెసులో అది వీలు కాకపోవడంతో కొత్త పార్టీని పెట్టుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించి ఆయన రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, ఆయన కుమారుడు నారా లోకేష్ చాలా కాలం తెర వెనకే ఉండిపోయారు. తన చదువులేవో తాను చదువుకుంటూ, తన వ్యాపారాలేవో తాను చూసుకుంటూ తెర వెనకే ఉండిపోయారు. కానీ, అకస్మాత్తుగా ఆయన అడ్డంకులను అధిగమించి రాజకీయాల్లో తన తండ్రి తర్వాత తనదే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి కూడా అది తప్పలేదు. తెరాస అధినేత కెసిఆర్‌కు మేనల్లుడు హరీష్ రావు అండదండలు అందిస్తూ వచ్చాడు. కెసిఆర్ తర్వాతి స్థానం హరీష్ రావుదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ విదేశాల నుంచి కెసిఆర్ కుమారుడు కెటి రామారావు వచ్చేసి ఆ స్థానాన్ని ఆక్రమించారు. కెటిఆర్‌గా పిలిచే కెటి రామారావు తన తండ్రి స్థానంలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధపడ్డారని చెప్పవచ్చు. ఏమైనా, అగ్రనేతల సన్ షైనింగ్ బ్రహ్మాండంగా వెలిగిపోతోంది.

Click it and Unblock the Notifications