జగన్ సూచనతో: కొణతాల, షర్మిలతో విజయమ్మకు నో

ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. పార్టీలో మెజార్టీ సభ్యులు పాదయాత్ర చేపట్టాలని, మరికొందరు ఓదార్పు యాత్ర చేపట్టాలని, ఇంకొందరు జిల్లాల్లోనే ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, అన్నింటిని క్రోడీకరించి రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యాత్ర చేసినా అది పాదయాత్రానా లేక రథయాత్రానా అనేది రేపు తేల్చుతామన్నారు.
కొందరు ఇడుపులపాయ, మరికొందరు చేవెళ్ల నుండి ప్రారంభించాలని కోరుతున్నారని, యాత్రలో ఎవరెవరు పాల్గొనాలనేది నిర్ణయిస్తామన్నారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను పాదయాత్రలో పాల్గొనవద్దని కోరామని చెప్పారు. అన్నింటి పైన పార్టీ నేతల నుండి అభిప్రాయాలు సేకరించామని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు పూర్తి చేసే దిశగా ప్రజల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని, వారి కోసమే ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. కిరణ్ ప్రభుత్వం జలయజ్ఞాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. అన్నీ ఓకే అయితే దసరాకు ముందే షర్మిల యాత్ర ప్రారంభమవుతుందన్నారు. షర్మిల నేతృత్వంలో పాదయాత్ర చేపట్టాలని అందరూ అభిప్రాయపడ్డారన్నారు. వైయస్ తన యాత్రను పూర్తి చేసిన ఇచ్ఛాపురంలోనే షర్మిల యాత్ర ముగుస్తుందన్నారు.
టిడిపి, కాంగ్రెసులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని జగన్‌ను అణిచివేయాలని చూస్తున్నాయన్నారు. జగన్‌తో చర్చించాక తేది, ఏ తరహా యాత్ర అన్నీ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు అధిష్టానం ఒకటేనని, అది ఢిల్లీలో ఉందన్నారు. జగన్ పైన కక్ష సాధింపు చర్యతో సిబిఐ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications