కెసిఆర్‌తో చర్చ తెలంగాణపై కాదు, ఎప్పుడో కష్టం: షిండే

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తాము తెలంగాణ అంశంపై చర్చించడం లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం న్యూఢిల్లీలో చెప్పారు. తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని షిండే స్పష్టం చేశారు. కెసిఆర్‌తో తెలంగాణ అంశంపై చర్చిస్తున్నామనే వార్తలను ఆయన కొట్టి పారేశారు. కెసిఆర్‌తో తాను ఎలాంటి చర్చలు జరపలేదన్నారు.

తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని చెప్పారు. కేంద్రం ప్రక్రియను కొనసాగిస్తోందన్నారు. అయితే ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. తెలంగాణ సున్నిత అంశమని, ఇరు ప్రాంతాల నేతలు, పార్టీల నుండి అభిప్రాయాల సేకరణ కొనసాగుతుందన్నారు. దసరా లేదా దీపావళిలోగా సేకరణ పూర్తవుతుందని కూడా చెప్పలేమని షిండే ఈ సందర్భంగా తెలిపారు. షిండే చంద్రబాబు లేఖపై పరోక్షంగా స్పందిస్తూ.. ఇప్పుడు అఖిలపక్షం కాదని చెప్పారు.

కాగా గత నెల నాలుగో తారీఖున ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ నెల రోజుల తర్వాత ఈ నెలలో హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. కెసిఆర్ హైదరాబాద్ వచ్చే ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలతో తాను తెలంగాణపై చర్చించానని, మరో దఫా చర్చల అనంతరం నిర్ణయం వెలువడుతుందని చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలఫ్రదంగా ముగిశాయని గత బుధవారం కెసిఆర్ అన్నారు.

ఆయన హైదరాబాదుకు బయలుదేరే సమయంలో న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పలువురు నేతలతో తాను తెలంగాణ అంశంపై చర్చించానని చెప్పారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, ఫలప్రదంగా ముగిశాయన్నారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. త్వరలో తుది విడత చర్చలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. తాను పలువురు సీనియర్లతో భేటీ అయ్యానని చెప్పారు.

మీడియాకు తెలిసి కొందరితోనే భేటీ అయ్యానని కానీ, తెలియకుండా చాలామందితో చర్చించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వచ్చానన్నారు. త్వరలో సుదీర్ఘ చర్చలు జరిగి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. తాను ముగ్గురు నలుగురు నేతలతోనే మాట్లాడలేదని చాలామందితో మాట్లాడానని చెప్పారు. అయితే ఈ రోజు సుశీల్ కుమార్ షిండే తాము కెసిఆర్‌తో తెలంగాణపై చర్చించడం లేదని చెప్పడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+