వర్ష మృతి: ఆశా, లతాలను ప్రశ్నించనున్న పోలీసులు

కుటుంబ సభ్యులంతా సింగపూర్ వెళ్లిన సమయంలో వర్షా భోంస్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము ఆశా భోంస్లే సోదరి లతా మంగేష్కర్, పనిమనిషి దిపాలీ మనే, డ్రైవర్ విజయ్ వాంగ్మూలాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికీ దిగ్భ్రాంతి నుంచి కోలుకోకపోవడంతో కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటి వరకు ప్రశ్నించలేదున.
త్వరలోనే పోలీసులు ఆశా భోంస్లే, లతా మంగేష్కర్‌లతో పాటు వర్షా భోంస్లే మాజీ భర్త హేమంత్ కక్రేను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. తనను తాను కాల్చుకోవడానికి వర్ష వాడిన బెల్జియం పిస్టల్ ఆశా చిన్న కుమారుడు ఆనంద్‌దని తెలుస్తోంది. దాన్ని ఇంటిలో భద్రంగా దాచినట్లు చెబుతున్నారు.
తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న వర్షా మానసిక వైద్యుల నుంచి చికిత్స కూడా పొందుతున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వర్ష మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. వర్ష విసెరా నమూనాలను పరీక్షల కోసం పంపించారు. బుల్లెట్ గాయాలతో వర్ష మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications