తెలంగాణ తప్ప: డికె అరుణ, షిండేపై పాల్వాయి ఫైర్

అందరు నేతలతోనూ తమకు తెలంగాణ తప్ప ఎలాంటి ప్యాకేజీ ఇతరత్రా వద్దని చెప్పామన్నారు. బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసినట్లు చెప్పారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా కోరామన్నారు. అలాగే వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. జడ్చర్ల నుండి రైల్వే లైన్ వేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషన్‌ను పునరుద్దరించే చర్యలు చేపట్టాలని చెప్పామన్నారు.
షిండే తెలుసుకొని మాట్లాడాలి.. పాల్వాయి
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. చర్చల ప్రక్రియ సంగతి తెలుసుకోకుండానే ఆయన మాట్లాడినట్లుగా కనిపిస్తోందన్నారు. షిండే వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు.
తమ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో గత కొంతకాలంగా తెలంగాణపై చర్చలు జరుపుతోందన్నారు. సిడబ్లుసి సభ్యులు కూడా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కెసిఆర్‌తో జరుపుతున్న చర్చలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications