హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరువుకోసం పాకులాట: నేతల 'ఆందోళన' యాత్రలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మన రాష్ట్రంలో ఇప్పుడు యాత్రల సీజన్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉండగానే పార్టీలు తమ తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. దీంతో చేసేది లేక ఒకరిని చూసి మరొకరు యాత్రల పేరుతో రోడ్డెక్కుతున్నారు. రోజంతా ప్రజల మధ్య గడుపుతూ పట్టు బిగించేందుకు కసరత్తులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించడం దానికి కౌంటర్‌గా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ షర్మిలచే మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశమయ్యాయి.

జగన్ పార్టీలో ఆందోళన

జగన్ పార్టీలో ఆందోళన

ఓ వైపు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రతో దూసుకు వెళ్తుంటే ఇన్నాళ్లూ తమకు తిరుగు లేదని భావించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. సెంటిమెంట్ తదితర అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ తొలి నుండి భావిస్తోంది. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికలలో ఆ పార్టీ భారీ విజయానికి కారణం సెంటిమెంట్ తప్ప మరొకటి లేదని రాజకీయ పరిశీలకుల భావన. ఇప్పుడు జగన్ జైలుకు వెళ్లడం, చంద్రబాబుకు ప్రజలు నీరాజనలా పట్టడంతో ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టాయి. జగన్ జైలులో ఉండటంతో నిరుత్సాహంగా ఉన్న క్యాడర్‌లో బాబు యాత్రతో మరింత నిస్తేజం కనిపించింది.

బాబుకు పోటీ యాత్ర

బాబుకు పోటీ యాత్ర

ఇది గమనించిన ఆ పార్టీ చంద్రబాబుకు పోటీ యాత్ర చేపట్టాలని భావించింది. తీవ్ర తర్జన భర్జన అనంతరం షర్మిలచే పాదయాత్ర చేయించాలని నిర్ణయించుకుంది. జగన్ జైలులో ఉండటం, విజయమ్మ వయస్సు దృష్ట్యా షర్మిలచే యాత్ర చేపట్టేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. అందుకు షర్మిల కూడా ఓకే చెప్పింది. పాదయాత్రా, ఓదార్పు యాత్రా, రథయాత్రా అనే అంశాలపై తీవ్ర తర్జన భర్జన అనంతరం పార్టీ నేతలు పాదయాత్రకే మొగ్గు చూపారు. దీంతో షర్మిల కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

సీమకు అన్యాయమంటూ....

సీమకు అన్యాయమంటూ....

రాయలసీమకు అన్యాయం జరుగుతోందని చెబుతూ ఆ ప్రాంతానికి చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమను కోరుతూ పాదయాత్ర చేపట్టారు. సీమలోని నాలుగు జిల్లాలను ఆయన పదిరోజుల పాటు చుట్టి వచ్చారు. ఈ రోజు ఆయన పాదయాత్ర ముగిసింది. ఆయన ఈ పదిరోజుల్లో 200 కిలోమీటర్లు నడిచి సీమ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల అవగాహన కల్పించారు. రాష్ట్రం విడిపోయిన పక్షంలో సీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఆయన సీమ అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ పదిహేను రోజుల క్రితమే టిడిపికి రాజీనామా చేశారు.

గత రెండేళ్లుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్, సీమాంద్రలో జగన్ సెంటిమెంట్ ఆ పార్టీని బాగా దెబ్బతీసిందనే చెప్పవచ్చు. దీంతో 2014లో మూడోసారి కూడా టిడిపి అధికారంలోకి రాకపోవచ్చుననే భావనతో ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు టిడిపికి గుడ్ బై చెప్పారు. పలువురు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు టర్మ్‌లు ప్రతిపక్షంలో ఉండటంతో పాటు.. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారటం క్యాడర్‌లో నిరుత్సాన్ని నింపింది.

ఇది గమనించిన చంద్రబాబు పార్టీలో కొత్త ఊపు తీసుకు వచ్చిందుకు భారీ పాదయాత్ర చేపట్టారు. 2200 కిలోమీటర్ల మేర పాదయాత్రకు మహాత్మా గాంధీ జయంతి రోజున శ్రీకారం చుట్ట్రారు. బాబు పాదయాత్రకు ప్రజల నుండి మంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ 2014లో అధికారంలోకి వస్తుందో రాదో అన్న గందరగోళంలో ఉన్న క్యాడర్‌లో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ గెలుపు ఖాయమని నొక్కి మరీ చెబుతున్నారు. దానికి తోడు బాబు యాత్రకు రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు కూడా మద్దతు పలకడం ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకు వచ్చింది. బాబు తనయుడు లోకేష్ కుమార్ యాత్ర ఆరంభంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

జగన్ పార్టీలో ఆందోళన

ఓ వైపు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రతో దూసుకు వెళ్తుంటే ఇన్నాళ్లూ తమకు తిరుగు లేదని భావించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. సెంటిమెంట్ తదితర అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ తొలి నుండి భావిస్తోంది. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికలలో ఆ పార్టీ భారీ విజయానికి కారణం సెంటిమెంట్ తప్ప మరొకటి లేదని రాజకీయ పరిశీలకుల భావన. ఇప్పుడు జగన్ జైలుకు వెళ్లడం, చంద్రబాబుకు ప్రజలు నీరాజనలా పట్టడంతో ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టాయి. జగన్ జైలులో ఉండటంతో నిరుత్సాహంగా ఉన్న క్యాడర్‌లో బాబు యాత్రతో మరింత నిస్తేజం కనిపించింది.

బాబుకు పోటీ యాత్ర

ఇది గమనించిన ఆ పార్టీ చంద్రబాబుకు పోటీ యాత్ర చేపట్టాలని భావించింది. తీవ్ర తర్జన భర్జన అనంతరం షర్మిలచే పాదయాత్ర చేయించాలని నిర్ణయించుకుంది. జగన్ జైలులో ఉండటం, విజయమ్మ వయస్సు దృష్ట్యా షర్మిలచే యాత్ర చేపట్టేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. అందుకు షర్మిల కూడా ఓకే చెప్పింది. పాదయాత్రా, ఓదార్పు యాత్రా, రథయాత్రా అనే అంశాలపై తీవ్ర తర్జన భర్జన అనంతరం పార్టీ నేతలు పాదయాత్రకే మొగ్గు చూపారు. దీంతో షర్మిల కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

సీమకు అన్యాయమంటూ....

రాయలసీమకు అన్యాయం జరుగుతోందని చెబుతూ ఆ ప్రాంతానికి చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమను కోరుతూ పాదయాత్ర చేపట్టారు. సీమలోని నాలుగు జిల్లాలను ఆయన పదిరోజుల పాటు చుట్టి వచ్చారు. ఈ రోజు ఆయన పాదయాత్ర ముగిసింది. ఆయన ఈ పదిరోజుల్లో 200 కిలోమీటర్లు నడిచి సీమ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల అవగాహన కల్పించారు. రాష్ట్రం విడిపోయిన పక్షంలో సీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఆయన సీమ అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ పదిహేను రోజుల క్రితమే టిడిపికి రాజీనామా చేశారు.

జగన్ విడుదల కోరుతూ...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదలను కోరుతూ ఆ పార్టీ నేతలు పలువురు మొన్నటి వరకు పాదయాత్రలు, పూజలు, పునస్కారాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్.. జగన్ విడుదలను కోరుతూ ఇటీవల పది కిలోమీటర్లు ఓ దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలని కోరుతూ యాత్ర చేశారు.

అదే దారిలో జగ్గారెడ్డి

ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి కూడా త్వరలో పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో ఇప్పుడు పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. మరి ఈ పాదయాత్రలు 2014 ఎన్నికలలో ఎవరిని గట్టెక్కిస్తాయో చూడాలి.

English summary
Padayatra season is going now in Andhra Pradesh. TDP chief Nara Chandrababu Naidu is doing yatra with Vastunna Meekosam. Sharmila is plannig with Maro Praja Prasthanam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X