mekapati rajamohan reddy ysr congress sobha rani telugudesam hyderabad మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు శోభారాణి తెలుగుదేశం హైదరాబాద్
ఏ హోదాలో జూ.ఎన్టీఆర్, బాలయ్య ప్రచారం: మేకపాటి

షర్మిల పాదయాత్రకు చంద్రబాబు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్న పాలన తెస్తామని తాము ప్రజలకు ధైర్యంగా చెప్పగలమని, తన పాలన తెస్తానని చంద్రబాబు ప్రజలకు ధైర్యంగా చెప్పగలరా అని అన్నారు. వైయస్ జగన్‌ను నిర్బంధించి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు శోభారాణి తీవ్రంగా మండిపడ్డారు. సెంటిమెంట్ ఓట్ల కోసం వైయస్ జగన్ జైలులోనే ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోరుకుంటున్నారని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇంతటి దిగజారుడు స్థితిలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
ప్రజాసమస్యల కోసం నాయకులు పాదయాత్రలు చేస్తుంటారని, అయితే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదనే కారణంతో పాదయాత్ర చేస్తామని అనడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే చెల్లిందన ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కథనాలు పంచటమే లక్ష్యంగా సాక్షి పత్రిక, టీవీ చానెల్ పనిచేస్తున్నాయని శోభారాణి విమర్శించారు.