హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యామిలీలో ఎవరో తేల్చుకునేందుకే షర్మిలయాత్ర: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికారం కోసమే వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. బాబువి అన్నీ స్పష్టత లేని హామీలేనన్నారు. ఆయన అధికారంలో ఉండగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని, ఇప్పుడు ఆయన దాని గురించి చెబుతే ఎవరూ నమ్మరన్నారు.

అమాయక రైతులను ఉత్తుత్తి హమీలతో మోసం చేసే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు. రైతులకు ఎంత రుణమాఫీ చేస్తారో బాబు చెప్పాలన్నారు. జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేయడం ప్రజలు తమను మరిచిపోకుండా ఉండేందుకే అన్నారు. వైయస్ కుటుంబంలో ఎవరు ఎక్కువ అని తేల్చుకునేందుకే షర్మిల ఈ యాత్రకు సిద్ధపడ్డారన్నారు.

తెలంగాణపై వక్రీకరణ వద్దు

తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని బొత్స సూచించారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి రెండో ఎస్సార్సీని పార్టీ ముసాయిదాలో చేర్చామని బొత్స చెప్పారు. కేంద్రం త్వరలో తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. విభజనపై ఏకాభిప్రాయం అవసరం లేదన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.

కాంగ్రెసు సభ్యత్వ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ సభ్యత్వ నమోదును ఈ నెల 18వ తేది నుండి ప్రారంభిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోని ముఖ్య నేతలు అందరూ పాల్గొంటారన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana said on Monday in Hyderabad that YSR Congress party leader Sharmila was planned to her padayatra to confirm who is the best in YSR family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X