హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

12 ఏళ్లైనా జగన్‌కు నో బెయిల్, షర్మిలా జైలుకే: గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో పన్నెండేళ్లు అయినా కోర్టుల నుండి బెయిల్ వచ్చే అవకాశం కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం అన్నారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.

తన సోదరుడు జగన్ కోసం మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రకు సిద్ధమవుతున్న షర్మిల రెడ్డి కూడా త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2014లోపే కాంగ్రెసు పార్టీలో విలీనం అవుతుందన్నారు. సాధార ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. జగన్ పార్టీ కాంగ్రెసులో విలీనం కావడం, కాంగ్రెసు ప్రజా వ్యతిరేక కార్యక్రమాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీయే వచ్చే ఎన్నికలలో మొదటి స్థానంలో ఉంటుందన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. బాబు యాత్రతో కార్యకర్తల్లో, నేతల్లో ఉత్సాహం కనిపిస్తోందన్నారు. ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పాలనతో విసిగిపోయి ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపికి పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.

అవిశ్వాసంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్నీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మరో నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి ఓర్వలేక వారు తమ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే లాలూచీ పడిందన్నారు.

English summary
Telugudesam Party senior leader Gali Muddukrishnama Naidu said that YSR Congress party chief YS Jaganmohan Reddy will not get bail even after 12 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X