హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను దొంగ: మోత్కుపల్లి, వాద్రాపై విజయమ్మ పలకరేం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఎందుకు మాట్లాడటం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ప్రశ్నించారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న భాను దొంగ అని, ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. వాన్ పిక్ వ్యవహారంలో ఇతర ఐఏఎస్ అధికారులను బెదిరించిన భానును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలెక్టర్లుగా పని చేసిన ఐఏఎస్ అధికారులు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో భాను తమను బెదిరించినట్లుగా చెప్పారన్నారు.

భాను ఓ దొంగ అని, ఆయనకు పదవిలో ఇంకా కొనసాగే అర్హత లేదని, వాన్ పిక్ కు సంబంధించిన ఛార్జీషీటులో ఆయన పేరు ఎందుకు లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే నేతల నుండి ఒత్తిళ్లు వస్తే అధికారులు పెన్ డౌన్ చేయాలని ఆయన సూచించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేదలను మోసం చేసిన నాయకుడు అన్నారు. పేదలకు 100 గజాల స్థలం అడిగితే ఇవ్వని అతను వాన్ పిక్‌కు మాత్రం 22వేల ఎకరాలు కట్టబెట్టారని విమర్శించారు.

విజయమ్మ, వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసుకు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల పాదయాత్ర వైయస్సార్ కాంగ్రెసును కాంగ్రెసులో కలిపేందుకా లేక కేసులను మాఫీ చేయించుకునేందుకు కూడా చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.

English summary

 Telugudesam Party senior leader Mothkupalli Narasimhulu wants CBI to act on Bhanu for pressuring IAS officials on VANPIC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X