హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి, కాంగ్రెస్: నల్ల బ్యాడ్జితో షర్మిల నిరసన పాదయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18వ తేది నుండి మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈమె తన మూడువేల కిలోమీటర్ల పాదయాత్రలో నల్లటి బ్యాడ్జిని ధరిస్తారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. అప్పటి వరకు ఆమె ఆ బ్యాడ్జిని ధరించే ఉంటారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అధికార పార్టీతో కుమ్మక్కయినందుకు నిరసనగా ఆమె ఈ నల్లటి బ్యాడ్జ్ ధరించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 18న పాదయాత్ర ప్రారంభమయ్యే ముందు ఇడుపులపాయలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. తొలి ఐదు రోజుల షెడ్యూలును పార్టీ కార్యాలయం ప్రకటించింది. తొలు రోజు ఉదయం 11 గంటలకు బహిరంగ సభ అనంతరం షర్మిల వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె నుంచి నాలుగు రోడ్ల కూడలి, రాజీవ్ నగర్ కాలనీ వరకు పాదయాత్ర చేస్తారు.

రెండో రోజు రాజీవ్‌నగర్ కాలనీ నుంచి నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్న పల్లె, అమ్మయ్యగారి పల్లె, చాగలేరు క్రాస్, వి కొత్తపల్లె, గొందిపల్లె క్రాస్, వేముల, భూమయ్యగారి పల్లె క్రాస్ వరకూ వెళతారు. మూడో రోజు అక్కడి నుంచి వేల్పుల, బెస్తవారిపల్లె, పులివెందుల ఆర్టీసీ బస్టాండ్, పూల అంగళ్ల మీదుగా పార్నపల్లె రోడ్డు, రింగురోడ్డు సర్కిల్ నుంచి వైయస్సార్ గృహానికి వెళతారు. నాలుగో రోజు పులివెందుల రింగ్‌రోడ్డు నుంచి చిన్న రంగాపురం, ఇప్పట్ల, చిన్న కుడాల క్రాస్, పెద్ద కుడాల క్రాస్, లింగాల, లోపట్నూతల క్రాస్ వరకూ పాదయాత్ర చేస్తారు.

ఐదో రోజున కర్ణపాపయ్య పల్లె, వెలిదండ్ల, నేర్జాంపల్లె, పార్నపల్లె వరకూ యాత్ర కొనసాగుతుంది. ఆ తరువాతి యాత్ర వివరాలు తదుపరి వెల్లడిస్తారు. తొలి రోజు 13 కిలోమీటర్లు, రెండో రోజు 19 కిలోమీటర్లు, మూడో రోజు 16 కిలోమీటర్లు, నాలుగో రోజు 16.2 కిలోమీటర్లు, ఐదో రోజు 16.8 కిలోమీటర్లు షర్మిల యాత్ర ఉంటుంది. ఆరో రోజు అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తారు.

English summary

 On October 18, when she begins her padayatra, Sharmila Reddy will wear a black badge, which she will wear throughout her 3,000km walkthon that starts from the Idupulayata in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X