హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన జగన్ పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: సాంఘీక సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యూత్ వింగ్ సోమవారం మంత్రి పితాని సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

హాస్టళ్లలో వసతులు కల్పించలేని మంత్రి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి ఇంటి ముందు ఉన్న బ్యారేకేడ్లను వారు తొలగించారు. ధరలు పెరిగినా పాత ఛార్జీలే చెల్లించడాన్ని నిరసిస్తూ వారు పితాని సత్యనారాయణ ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేసిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వారిని అరెస్టు చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించారు. కాగా సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు హాస్టళ్ల మెస్ ఛార్జీలను పెంచడం లేదని పార్టీ యువజన విభాగం నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

English summary
YSR Congress party youth win leaders were arrested by Hyderabad police on Monday morning. They were stalled at minister Pitani Satyanarayana residence and demanded to solve hostel problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X