బొగ్గుస్కాంలో మరో 2కేసులు: 6సిటీల్లో సిబిఐ సోదాలు

హైదరాబాద్ సహా విశాఖపట్నం, సాత్నా, జైపూర్, న్యూఢిల్లీ, రూర్కేలా నగరాలలోని పదహారు ప్రాంతాలలో సిబిఐ ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఫోర్జరీ, చీటింగ్‌తో పాటు నికర ఆస్తుల విలువను ఎక్కువగా చూపి బొగ్గు గనులు కాజేశారని కమలేష్ స్టీల్స్, గ్రీన్ ఇన్‌ఫ్రాలపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ రెండు కంపెనీలే కాకుండా దేశవ్యాప్తంగా చాలా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సెప్టెంబర్ నాలుగో తేదిన సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చసి దర్యాఫ్తు చేపట్టింది. అప్పట్లో సిబిఐ కొన్ని చోట్ల సోదాలు చేసింది. ఆ సోదాల్లో బయటపడిన సమాచారం ఆధారంగా తాజాగా ఐదు రాష్ట్రాల్లోని ఆరు నగరాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications