వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లో నరేంద్ర మోడీ గాలి: ఆందోళనలో కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధిని లెక్క చేయడం లేదని కానీ, యుకె వంటి ఇతర దేశాలు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నాయని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల క్రితం తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే గుజరాత్ ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం డిసెంబరులో జరిగే సాధారణ ఎన్నికలలో మోడియే మళ్లీ గెలుస్తారని యూరప్ దేశాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.

సీట్లు రావడంలో బిజెపికి కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వమే మళ్లీ ఏర్పడుతుందని అంతర్జాతీయవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు. దీంతో పలు దేశాల్లో మోడీ గాలి వీస్తోంది. గుజరాత్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు పశ్చిమ దేశాలు క్యూ కడుతున్నాయి. విదేశాల్లో కూడా మోడీ గెలుపు పైనే నమ్మకం ఉండటంతో కాంగ్రెసుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. 2002 మత కలహాల తర్వాత పదేళ్లుగా మోడి పట్ల వెలివేత వైఖరిని అనుసరిస్తున్న బ్రిటన్ సైతం తాజాగా మోడీతే సంబంధాలు పునరుద్ధరించుకోనున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీలోని తమ రాయబారిని గాంధీనగర్ వెళ్లి మోడీని కలవాలని బ్రిటన్ ఆదేశించింది. మోడీకి వీసా నిరాకరించిన అమెరికా కూడా ఇప్పుడు పునరాలోచనలో పడింది. గుజరాత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థల్లో ఒక్కటని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. గుజరాత్‌లో తమ కంపెనీలు ఉండటం తమకే ఎక్కువ లాభమని జర్మనీ రాయబారి ఓ సందర్భంలో చెప్పారు. మోడీ పైన ఆంక్షలు ఎత్తివేసే విషయమై మాట్లాడకపోయినప్పటికీ క్రమంగా పశ్చిమ దేశాల్లో ఆయన పట్ల మార్పు కనిపిస్తోంది. మోడీకి భారతీయ ఓటర్ల కన్నా విదేశాల ఆమోదమే ఎక్కువగా ఉందని కాంగ్రెసు ఎద్దేవా చేయడం గమనార్హం.

English summary

 European Contries are seeing now at Gujarat state and they are hoping Narendra Modi will become CM again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X