హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న జగన్ ఓదార్పు.. నేడు షర్మిల పాదయాత్రపై ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం నుండి చేపట్టనున్న పాదయాత్ర గురించి కాంగ్రెసు పార్టీ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు కాంగ్రెసు పెద్దలు దాని గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లడంతో షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు.

ఇప్పుడు కాంగ్రెసు పెద్దలు షర్మిల యాత్ర గురించి ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలతో పాటు షర్మిల యాత్ర గురించి కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెసు ప్రస్తుత పరిస్థితిపై వారు ఆరా తీశారు. తెలంగాణ, జగన్ ప్రభావాలు ఎలా ఉన్నాయో కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారని సమాచారం. జగన్ అరెస్టు తర్వాత షర్మిల ఉప ఎన్నికల ప్రచారంలో తన తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో పాటు పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వారు కిరణ్‌తో పాటు పలువురు రాష్ట్ర నేతల నుండి అడిగి తెలుసుకుంటున్నాట్లుగా సమాచారం.

రేపటి నుండి షర్మిల చేపట్టబోయే పాదయాత్ర ప్రభావం పార్టీపై పడుతుందా, పడితే ఎలా ఉండబోతుందోనని అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ నెల 18వ తేది నుండి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుండి ఆమె పాదయాత్ర ప్రారంభమవుతుంది.

English summary

 Congress party High Command is inquiring about YSR Congress party chief YS Jaganmohan Reddy's sister Sharmila Maro Praja Prastanam padayatra from Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X