వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికివారే యమునా తీరే!: చిరంజీవి పట్టు బొత్స బెట్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు పార్టీ ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉంది! ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలు పార్టీలో పట్టు కోసం ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు, పలు విషయాల్లో తమ బెట్టును సాధించుకునేందుకు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వారి మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

 ఆది నుండి అసంతృప్తితో చిరంజీవి

ఆది నుండి అసంతృప్తితో చిరంజీవి

రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన పార్టీని విలీనం చేసిన తర్వాత నుండే రాష్ట్ర పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడా తనతో పాటు కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన మాజీ పిఆర్పీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆయన వాదన. పార్టీలో తన వర్గం వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పలుమార్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వర్గం మంత్రి సి.రామచంద్రయ్య ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరికొందరు కాంగ్రెసులో చిరు వర్గానికి సరైన న్యాయం జరగడం లేదని చెబుతారు.

ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల పంపకానికి తెర లేవడంతో చిరంజీవి మరోసారి తన వర్గం నేతలకు పదవులు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన వర్గం వారికి ఇన్ని పోస్టులు ఉండాలి, ఇవి ఉండాలి, వీరిని నియమించాలని ఆయన ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌కు ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారం. తన వర్గం వారికి ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో చిరంజీవి తన అసంతృప్తిని బయటకు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తన వారి కోసం చిరంజీవి పట్టుబడుతున్నట్లుగా సమాచారం.

ఆధిపత్యం కోసం బొత్స

ఆధిపత్యం కోసం బొత్స


పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో తన ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయా జిల్లాల్లోని తన అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం నియోకవర్గం వారిగా తనకు అనుకూలురైన వారి లిస్ట్‌ను తయారు చేసుకున్నట్లుగా సమాచారం. చైర్మన్‌లలో కనీసం అరడజను మంది తన వాళ్లు ఉండాలని బొత్స గట్టిగా పట్టుపడుతున్నారట.

 తనదైన ముద్ర కోసం కిరణ్

తనదైన ముద్ర కోసం కిరణ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు కూడా ఇందుకు భిన్నంగా లేదు. నామినేటెడ్ పోస్టులతో పాటు మంత్రివర్గంలో కూడా తన ముద్ర కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీ టూర్ ఇప్పుడు ప్రధానంగా దీని కోసమే. పలువురు మంత్రులు తనను టార్గెట్ చేసుకుంటున్న నేపథ్యంలో వారికి ఉద్వాసన పలికి తనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి, సి.రామచంద్రయ్య తదితర మంత్రులపై కిరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

నేతలు ఎవరికి వారే పార్టీలో తమ ప్రాధాన్యత నిలుపుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కొంతకాలం పాటు వారి మధ్య విభేదాలు పతాక శీర్షికలకెక్కాయి. ఆ తర్వాత కాస్త సద్దుమణిగినప్పటికీ పార్టీలో పదవుల పందేరానికి తెర లేవడంతో మరోసారి వారి మధ్య చిచ్చు రాజుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ కోసం కిరణ్ ఢిల్లీలో తన ప్రయత్నాలు చేస్తున్నారు.

అడ్రస్ లేని సమన్వయ కమిటీ

రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో సమన్వయం కోసం అంటూ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ అడ్రస్ లేదనే చెప్పవచ్చు. కమిటీ ఏర్పడిన కొత్తలో హడావుడిగా ఒక్కసారి భేటీ అయింది. ఆ తర్వాత తాను జాడే కనిపించడం లేదు. కమిటీలో ఉన్న బొత్స, చిరు, కిరణ్‌ల మధ్యే తొలుత విభేదాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కమిటీలో ఉన్న కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, మాజీ పిసిసి చైర్మన్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, ఎంపీ కావూరి సాంబశివ రావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీల జాడ లేదు.

English summary
CM Kiran Kumar Reddy, PCC chief Botsa Satyanarayana and MP Chiranjeevi are trying to get more nominated posts to their followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X