మిర్యాలగూడాలో తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు సజీవదహనం!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిద్రలోనే మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.

ఇంట్లో షార్ట్ సర్క్యూట్... పేలిన గ్యాస్ సిలిండర్

స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మృతులను వనం చంద్రకళ, ఆమె మనవడు లక్ష్మణ్ , మనవరాలు ప్రణతిగా గుర్తించారు. బాధితులు రేకుల ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. హఠాత్తుగా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. కొద్ది క్షణాల్లోనే ఆ మంటలు వంట గదిలోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కు అంటుకోవడంతో అది కాస్తా ఒక్కసారిగా పేలిపోయింది.

A gas cylinder blast triggered by an electrical short circuit in Miryalaguda causes three members death

క్షణాల్లో దగ్ధమైన ఇల్లు

ఇల్లు చిన్నది కావడం, రేకుల కప్పు ఉండటంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా ఆవరించాయి. దీంతో బాధితులకు కనీసం బయటకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
సిలిండర్ పేలిన భారీ శబ్దానికి స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై, చుట్టుపక్కల వాళ్ళు ఘటనా స్థలానికి పరుగున వచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

ముగ్గురు సజీవ దహనం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతిలు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు.మృతుల కుటుంబంలో కొద్ది రోజుల క్రితమే మరో విషాదం ఉంది. చంద్రకళ భర్త నెలరోజుల క్రితమే ప్రాణాలు కోల్పోయాడు.

సభకు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేదికాదు, కేటీఆర్ వ్యాఖ్యలపైనా పవన్ కళ్యాణ్
సభకు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేదికాదు, కేటీఆర్ వ్యాఖ్యలపైనా పవన్ కళ్యాణ్

ఒంటరిగా మిగిలిపోయిన మహిళ

పిల్లల తండ్రి గతంలోనే మరణించగా, వారి తల్లి ధనమ్మ కుటుంబ పోషణ నిమిత్తం మూడు రోజుల క్రితమే పుణే నగరానికి పని కోసం వెళ్లారు. పిల్లలను అమ్మమ్మ చంద్ర కళ సంరక్షణలో ఉంచి వెళ్లిన కొద్ది రోజులకే ఈ ఘోరం జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే వరుస మరణాలతో ధనమ్మ ఒంటరిగా మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+