హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేతల పాదయాత్రలపై ఎంపి జయప్రద హాట్ కామెంట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ayaprada
హైదరాబాద్: మాజీ నటి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యురాలు జయప్రద మంగళవారం పాదయాత్రలపై హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పాదయాత్రల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వస్తున్నా మీకోసం పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభించగా, మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఈ నెల 18వ తేది నుండి ప్రారంభించనుంది.

దీనిపై విలేకరులు ప్రశ్నించగా జయప్రద స్పందించారు. పాదయాత్రలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. పాదయాత్రలతో ఒరిగేదేమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. పాదయాత్రల వల్ల తమకు ఏమైనా లాభం జరుగుతుందా లేదా అని ప్రజలు నిర్ణయించుకోవాలని ఆమె సూచించారు.

కాగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు పలువురు పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మూడోసారైనా పవర్‌లోకి రావానే ఉద్దేశ్యంతో ఉంది. ఇందుకోసం పార్టీలో నూతనోత్తేజం తీసుకు వచ్చేందుకు, పార్టీలో విశ్వాసం కలిగించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారు.

కొత్తగా పుట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు కేవలం సెంటిమెంట్‌తో కాలాన్ని నెట్టుకు వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల వరకు ఆ సెంటిమెంటును అలాగే ఉంచుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు.

English summary
Rampur MP Jayaprada make hot comments on padayatra on Tuesday. She said oppositions are using padayatra to attack on government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X