వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం బిజీ బిజీ: రాహుల్‌తో కిరణ్, ప్రధానితో యువనేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. పలువురు కాంగ్రెసు పెద్దలతో ఆయన కలుస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చిస్తున్నారు. వీటి కోసం కిరణ్ అధిష్టానం అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి మధ్యాహ్నం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్‌తో కిరణ్ రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి, తెలంగాణ ప్రభావం తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. అంతకుముందు కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌తో కిరణ్ భేటీ అయ్యారు.

నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుమతించాల్సిందిగా కిరణ్ ఆయనను కోరినట్లుగా సమాచారం. ఇప్పటికే ఆజాద్, రాహుల్‌తో భేటీ అయిన కిరణ్ ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు వాయలార్ రవి, అహ్మద్ పటేల్‌లతో భేటీ కానున్నారు.

రాహుల్‌తో భేటీ ముగిసన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. మరోవైపు కిరణ్‌తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆయన కేంద్రమంత్రివర్గ విస్తరణపై ప్రధానితో చర్చించినట్లుగా సమాచారం.

వీరప్ప మొయిలీతో వివేక్

పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు.

English summary
CM Kiran Kumar Reddy met Rahul Gandhi and Ghulam Nabi Azad on Wednesday. He will meet Sonia Gandhi, Vayalar Ravi and Ahmed Patel also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X