వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ: మీడియాకు క్లాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్‌కతా: ఆడ మగా రాసుకు పూసుకు తిరిగితే రేప్‌లు జరగవా అని సంచలన ప్రకటన చేసిన తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి టీచర్ అవతారమెత్తారు. మీడియాకు క్లాస్ తీసుకున్నారు. ఎలాంటి వార్తలు రాయాలి, ఎలాంటి ఫోటోలు ఉపయోగించాలి వంటి సూచనలు మీడియాకు చేశారు. మీడియా తన బాధ్యత మరిచి ప్రవర్తిస్తోందని ఆమె మండిపడ్డారు.

విలేకరులు ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా రాజకీయాలను శాసించాలని చూస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక కథనాలు చేయొద్దని సూచించారు. స్టూడియోల్లో కూర్చొని డబ్బు సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు మీడియా విలువలకు కట్టుబడి ఉండేదని, ఇప్పుడు అలా లేదన్నారు. తృణమూల్ కాంగ్రెసు అధికార పత్రిక జాగో బంగ్లా ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా ఆమె మీడియాకు క్లాస్ తీసుకున్నారు.

అత్యాచారాలు, ఆత్మహత్యలను ప్రముఖంగా చూపించవద్దని, డబ్బు సంపాదన కోసం ప్రజలకు హాని కలిగించవద్దని, ప్రభుత్వం పేరు చెడగొట్టవద్దని, భయానక ఫోటోలు ఉపయోగించవద్దని, నిరాధార వార్తలు రాయొద్దని, ప్రతి వార్త పూర్వాపరాలు తెలుసుకోవాలని, రాజకీయాలను శాసించాలనుకోవద్దని, స్టూడియోల్లో కూర్చొని దాదాగిరి చేయవద్దని మమతా బెనర్జీ ఈ సందర్భంగా మీడియాకు సూచించారు.

English summary

 West Bengal CM Mamata Banerjee took class to media on journalism values on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X