వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాద్రా సరే సోనియా: కేజ్రీవాల్‌కి స్వామి, మోడీకి కితాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Subramanian Swamy
పాట్నా: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను టార్గెట్‌గా చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ పైన జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలో వాద్రా పెద్ద మొత్తంలో కూడగట్టిన వైనం వెలుగులోకి తీసుకు రావడం సరైనదేనని, అయితే సోనియా గాంధీని విడిచి పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వాద్రా తప్పు చేయడానికి కారణమైన సోనియాపై ఎందుకు పోరాడరన్నారు.

రాబర్ట్ వాద్రా అక్రమాలకు పాల్పడేందుకు ఎవరిని ఉపయోగించుకుంటున్నారు, ఆయనను ఎవరు ప్రభావితం చేస్తున్నారో ఎందుకు బయటకు చెప్పడం లేదని ప్రశ్నించారు. మీడియాకు ఎక్కి ప్రజల నుండి మార్కులు కొట్టేసేందుకే కేజ్రీవాల్ ఇలా చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అదే కాకుంటే కోర్టుకు వెళ్లవచ్చు కదా అని చెప్పారు. కేజ్రీవాల్ తన రాజకీయ పునాదుల కోసమే ఇలా చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.

లౌకికవాదిని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యల పైనా ఆయన స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి లౌకికవాదే అన్నారు. అందుకే ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారన్నారు. హిందువులందరూ లౌకికవాదులేనని, మోడీ హిందుత్వ సిద్దాంతాన్ని నమ్ముతారని, హిందువులకు లౌకికవాదం పుట్టుకతోనే వస్తుందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు.

సిబిఐ ఉచ్చు నుండి తప్పించుకోవడానికే ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసుకు కొమ్ముకాస్తున్న పార్టీలు గల్లంతు కావడం ఖాయమన్నారు. ప్రభుత్వ స్థిరంగా ఉన్నంత కాలం కొందరు మద్దతు పలుకుతారని, పడిపోతుందని తెలిస్తే ఉపసంహరించుకోవడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు.

English summary
Alleging that Robert Vadra used his connections with the Gandhi family to accumulate wealth and commit other improprieties, Janata Party chief Subramanian Swamy on Tuesday questioned Arvind Kejriwal for restricting his expose to Vadra only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X