రూ.890 కోట్ల నష్టం: యడ్డీకి సిబిఐ షాక్, ఛార్జీషీట్

యడ్డీ బిజెపితో తెగతెంపులు చేసుకొని కొత్త పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో సిబిఐ అతనికి పెద్ద షాక్ ఇచ్చింది. జిందాల్ కంపెనీకి గనుల కేటాయింపులో వీరు అక్రమాలకు పాల్పడ్డారని, తద్వారా యడ్యూరప్ప కుటుంబానికి రూ.20 కోట్ల మేర ముడుపులు అందాయని అందులో సిబిఐ పేర్కొంది.
భూముల డీనోటిఫికేషన్‌లో రూ.20 కోట్లు ముట్టాయని చెప్పారు. యడ్యూరప్ప అవినీతివల్ల రాష్ట్ర ఖజానాకు రూ.890 కోట్లదాకా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే యడ్డీ, ఆయన కుమారులు ముందస్తు బెయిల్ పొందడం, దీని రద్దుకు సుప్రీం కోర్టులో సిబిఐ ప్రయత్నించి విఫలమవడంతో వీరి అరెస్టుకు అవకాశాలు లేవని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications