కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాత్రలో షర్మిలతో కదం కలిపిన భారతి, విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma-YS Bharati-Sharmila
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం మధ్యాహ్నం తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. ఆమె తన యాత్రను వైయస్సార్ ఘాట్ నుండి ప్రారంభించారు. షర్మిల యాత్రకు కడప జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. షర్మిల యాత్రలో జగన్ సతీమణి భారతి రెడ్డి, తల్లి విజయమ్మ పాల్గొన్నారు. షర్మిల అడుగులో అడుగేస్తూ వారు తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్నారు.

షర్మిల సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు కిలోమీటర్లు నడిచారు. ట్రిపుల్ ఐటి, వీరగట్టుపల్లె, కుమ్మరాంపల్లె మీదుగా ఆమె యాత్ర కొనసాగింది. షర్మిల వెంటే పార్టీ నేతలు శోభా నాగి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా తదితరులు కూడా ఉన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి వారు పాదయాత్ర చేస్తున్నారు.

కాగా అంతకుముందు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో విజయమ్మ, షర్మిల భారీ బహిరంగ సభలో మాట్లాడారు. వారిద్దరూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై, కాంగ్రెసు ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు జగన్‌ను టార్గెట్ చేసుకొని చీకట్లో కేంద్రమంత్రి చిదంబరంను కలిశారని ఆరోపించారు.

షర్మిల తనను తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్ సోదరిగా పరిచయం చేసుకున్నారు. ఉప ఎన్నికల సమయంలోనూ ఆమె అదేవిధంగా పరిచయం చేసుకున్నారు. తన అన్న తరఫున తాను పాదయత్ర చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. విజయమ్మ ఉద్వేగంగా మాట్లాడటం అందరినీ కలిచి వేసింది.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy's wife Bharathi Reddy has participated in YS Sharmila's Maro Praja Prastanam padayatra on first day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X