దుస్తులు ఇస్త్రీ చేసిన చంద్రబాబు, టైలర్లకు పలకరింపు

అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు చేపడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో ఇళ్లు లేనివారికి స్థలాలు మంజూరుచేసి, వారికి రాయితీతో ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. తమ పార్టీ ఎన్నడూ ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, కొందరు వ్యక్తులు అలాంటి భావనను ఉద్యోగుల్లో కల్పించారని ఆయన అన్నారు. తమ హయాంలో డీఎస్సీ ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు.
ప్రతిభావంతులకు తమ పార్టీ మాత్రమే పట్టం కట్టిందని చెప్పుకున్నారు. ఉద్యోగ బదిలీలకు ఓ పద్ధతిని ప్రవేశ పెట్టింది కూడా తమ పార్టీయేనని ఆయన చెప్పారు. ఇక.. తమ పాలనలో ఆర్టీసీని పరిరక్షిస్తూ వచ్చామని, కాంగ్రెస్ ఆ సంస్థను దివాలా తీయించిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల కు ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తామన్నారు.
రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం జనతా వస్త్రాలను ప్రవేశపెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ. 1.2 లక్షలతో చేనేత కార్మికులకు షెడ్డుతో కూడిన ఇళ్లు నిర్మిస్తామన్నారు. అధికారంలోకి వస్తే తొలి సంతకాన్ని రైతు రుణమాఫీ ఫైలుపై పెడతానని, రెండో సంతకం బెల్టుషాపుల రద్దు ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు. ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తే వారి అన్నగా వారికి అండగా ఉంటానని చంద్రబాబు చెప్పారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కేరాఫ్ కుంభకోణం అయిందని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఏకంగా సీఎం కుర్చీకి పోటీ పడటం విడ్డూరమని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications