వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ గాంధీపై రేప్ కేసును కొట్టేసిన సుప్రీం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: రేప్ కేసులో కాంగ్రెసు నేత, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీకి క్లీన్‌చిట్ లభించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాహుల్ గాంధీ, ఆయన మిత్రులు సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారంటూ 2006లో వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు బూటకంగా అభివర్ణించింది. రాహుల్ గాంధీపై పిటిషన్ వేయడానికి సమాజ్‌వాదీ పార్టీ పురికొల్పిందని పిటిషనర్ చెప్పిన విషయంపై సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది.

ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసిన ప్రయత్నానికి గాను రాహుల్ గాంధీకి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవని జస్టిస్ బిఎసల్ చౌహాన్,త జస్టిస్ స్వతంతర్ కుమార్‌లతో కూడా సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.

కిశోర్ స్మృతే 2011లో వేసిన పిటిషన్ స్వచ్ఛతా బుద్ధితో వేసింది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణలు రాహుల్ గాంధీకి ప్రజల్లో ఉన్న ప్రతిష్టను దెబ్బ తీశాయని చెప్పింది. ఓ వెబ్‌సైట్ వార్తాకథనాన్ని ఆధారం చేసుకుని స్మృతే రాహుల్ గాంధీ, ఆయన మిత్రులకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

అమేథీలో రాహుల్ గాంధీ, ఆయన మిత్రులు 2006 డిసెంబర్ 3వ తేదీన ఓ బాలికను అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ వెబ్‌సైట్‌లో వార్త వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని స్మృతే పిటిషన్ వేశారు. తనపై బురద చల్లడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని రాహుల్ గాంధీ అంతకు ముందు కోర్టుకు చెప్పారు.

English summary
The Supreme Court Thursday gave a clean chit to Congress general secretary Rahul Gandhi, saying that the 2006 allegation of gang rape against him and his friends was fake. It also ordered that Gandhi be paid Rs. 5 lakh as compensation for damage to his reputation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X