దసరా బుల్లోడిలా కెసిఆర్ మాటలు: టిజి వెంకటేష్

తెలంగాణ అంశం ప్రక్రియ చివరి దశకు చేరుకుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ మంత్రుల్లో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణ కోసం అందరం కలిసి పని చేస్తున్నామని ఆయన హైదరాబాదులో శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే ఢిల్లీ పర్యటన అని, ఇదే చివరి పర్యటన కావొచ్చని పొన్నాల అన్నారు.
ఇదిలావుంటే, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డితో రాష్ట్ర మంత్రి జానారెడ్డి శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చించినట్లు తెలుస్తోంది. జానారెడ్డితో పాటు ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్యలు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. జానారెడ్డితో పాటు మిగతా మంత్రులు అధిష్టాన పెద్దలను కలవనున్నారు.
ఒకరిద్దరు మినహా తెలంగాణ ప్రాంత కాం గ్రెస్ ప్రజా ప్రతినిధులమంతా ఐక్యమత్యంతోనే ఉన్నామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని, అధిష్ఠానాన్ని ఒప్పిస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయిస్తామని బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. నగరంలోని వరంగల్ బస్ స్టేషన్‌లో గురువారం కాజీపేట్- వరంగల్ రూట్‌లో ఆరు మెరుపు బస్సులను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications