చిరును బలహీనపరిస్తే నష్టం: రామచంద్రయ్య సంచలనం

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు వెళ్లి పోయిన మాట నిజమేనని చెప్పారు. పోయిన ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకోవాల్సిన, తెప్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దీనికోసం పార్టీలోని అందరూ కృషి చేయాలన్నారు. చిరంజీవి బలపడితేనే కాంగ్రెసు పార్టీ బలపడుతుందన్నారు. చిరంజీవిని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగితే అది అంతిమంగా కాంగ్రెసు పార్టీకే నష్టమని చెప్పారు. చిరంజీవికి రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉందన్నారు.
కాగా మంత్రి సి.రామచంద్రయ్య తొలి నుండి కాంగ్రెసు పార్టీలో చిరంజీవి వర్గానికి ప్రాధాన్యత లేదనే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయన పిఆర్పీకి న్యాయం జరగలేదని చెప్పారు. త్వరలో నామినేటెడ్ పదవుల పందేరం ఉండటంతో ముందుగానే ఆయన చిరంజీవి వర్గం కోసం జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications